నెల్లూరు జిల్లాలో లారీని ఢీకొట్టిన తెలంగాణ ఆర్టీసీ బస్సు.. ఇద్దరి మృతి
- మిర్యాలగూడ నుంచి తిరుపతి వెళ్తుండగా ప్రమాదం
- అక్కడికక్కడే మృతి చెందిన డ్రైవర్ వినోద్
- మరో ఏడుగురికి తీవ్ర గాయాలు
ఈ ఘటనలో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. దీంతో డ్రైవర్ వినోద్ (45) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరు తరలించారు. వీరిలో 65 ఏళ్ల వృద్ధురాలు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.