ESMA: అంగన్ వాడీల సమ్మెపై ఎస్మా

AP government imposes ESMA to Anganwadi workers
  • ఏపీ ప్రభుత్వ సంచలన ఉత్తర్వులు
  • అత్యవసర సర్వీసులలోకి చేర్చుతూ నిర్ణయం
  • గత నెల వేతనంలోనూ కోత విధించిన సర్కారు
  • వర్కర్లు, హెల్పర్లకు రూ.3 వేలు తగ్గించి చెల్లింపు
ఆంధ్రప్రదేశ్ లో సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై జగన్ సర్కారు ఉక్కుపాదం మోపింది. ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్ వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి, ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు శనివారం జీవో నెం.2 విడుదల చేసింది. గడిచిన 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాల్లోనూ ప్రభుత్వం కోత విధించింది. సమ్మెలో ఉన్న కాలానికి సంబంధించి వేతనం కట్ చేసింది. నెలనెలా వర్కర్ల ఖాతాలో పడుతున్న రూ. 10 వేల వేతనం స్థానంలో ప్రభుత్వం ఈ నెల రూ.8,050 మాత్రమే జమ చేసింది.

ఎస్మా అంటే..
ది ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ కు సంక్షిప్త రూపమే ఎస్మా.. ప్రజల సాధారణ జీవనం సాఫీగా సాగేందుకు తోడ్పడే సర్వీసులకు భంగం కలగకుండా ఈ చట్టం ఉపయోగపడుతుంది. వైద్యం, ప్రజా రవాణా వంటి అత్యవసర సేవలు అందించే రంగాలలోని సిబ్బంది సమ్మెల పేరుతో విధులకు గైర్హాజరు కాకుండా ప్రభుత్వం ఈ చట్టం ప్రయోగించవచ్చు.
ESMA
Anganwadis
AP government
Andhra Pradesh
YS Jagan
AP CM

More Telugu News