Raghu Rama Krishna Raju: వైసీపీకి కేంద్రం అనుకూలమనే అపవాదును బీజేపీ నేతలు తొలగించుకోవాలనుకుంటున్నారు: రఘురామకృష్ణరాజు

BJP will target YSRCP says Raghu Rama Krishna Raju
  • అయోధ్య వేడుక తర్వాత శుభవార్త వింటారన్న రఘురాజు
  • జగన్ ప్రభుత్వ తప్పులను ఖండించాలని బీజేపీ నేతలు నిర్ణయించారని వ్యాఖ్య
  • వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తాయని ఆశాభావం
సీఎం జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అనుకూలమనే అపవాదును తొలగించుకోవాలని బీజేపీ అగ్ర నేతలు యోచిస్తున్నారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ వేడుక అనంతరం రాష్ట్ర ప్రజలు శుభవార్తను వింటారని చెప్పారు. జగన్ ప్రభుత్వం ఎన్నో తప్పులు చేసిందని, ఆ తప్పులను తీవ్రంగా ఖండించాలని బీజేపీ నేతలు నిర్ణయించారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్లాలని తాను ఆశిస్తున్నానని చెప్పారు. సీపీఎస్ ను రద్దు చేయాలని మహారాష్ట్రలోని బీజేపీ, శివసేన ప్రభుత్వం నిర్ణయించిందని రఘురాజు తెలిపారు. ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ముందుకు సాగనుండటంతో... ఓపీఎస్ కోసం రాష్ట్ర ఉద్యోగులంతా ఈ కూటమికి మద్దతుగా నిలవాలని కోరారు.
Raghu Rama Krishna Raju
Jagan
YSRCP
BJP

More Telugu News