Dr Somnath: జేఎన్టీయూ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్

ISRO Chairman Dr Somnath receives doctorate from JNTU Hyderabad
  • ఇస్రో విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న డాక్టర్ సోమ్ నాథ్
  • గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన జేఎన్టీయూ-హైదరాబాద్
  • వర్సిటీలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామన్న సోమ్ నాథ్
  • తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు చేపడతామని వెల్లడి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను విజయాల బాటలో నడిపిస్తున్న ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ సోమ్ నాథ్ కు జేఎన్టీయూ-హైదరాబాద్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 

ఇవాళ హైదరాబాదులో జేఎన్టీయూ 12వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ కూడా హాజరయ్యారు. జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి చేతులమీదుగా డాక్టరేట్ అందుకున్న అనంతరం సోమ్ నాథ్ ప్రసంగించారు. 

ఓటమి విజయానికి పాఠం వంటిదని అన్నారు. తాను కూడా రాకెట్ డిజైనింగ్ లో అనేక తప్పులు చేశానని, వాటి నుంచే నేర్చుకుని ముందుకెళ్లానని వివరించారు. చంద్రయాన్-3 విజయం యావత్ భారతదేశం గర్వపడేలా చేసిందని చెప్పారు. 

కాగా, తక్కువ వ్యయంతో ప్రాజెక్టులు చేపట్టడంపై దృష్టి సారించామని, వర్సిటీలతో కలిసి పనిచేయడంపై వీసీతో చర్చించామని డాక్టర్ సోమ్ నాథ్ తెలిపారు.
Dr Somnath
ISRO Chairman
Doctorate
JNTU Hyderabad

More Telugu News