VH: సోనియాగాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం: వీహెచ్

V Hanumantha Rao says sonia gandhi will win if she contest from khammam
  • సోనియా ఖమ్మం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం అన్ని స్థానాల్లో ఉంటుందన్న వీహెచ్
  • సోనియా కోసం, కాంగ్రెస్ కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తామని వ్యాఖ్య
  • ఇండియా కూటమిని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని ధీమా
రానున్న లోక్ సభ ఎన్నికల్లో సోనియాగాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం అన్ని స్థానాలలో ఉంటుందని.. ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎంపీ ఎన్నికల్లో సోనియాగాంధీ, కాంగ్రెస్ గెలుపు కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ హామీలను నెరవేరుస్తుందని బీజేపీ, బీఆర్ఎస్‌లకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ విడుదల చేసిన కాంగ్రెస్ 420 బుక్‌లెట్‌పై వీహెచ్ తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్ష నేతలకు పనిలేక బుక్ లెట్‌తో తమ పార్టీని బద్నాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. మేం ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు గెలిపించారన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఎన్ని హామీలు నెరవేర్చిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులకు మూడెకరాల భూమి... ఇంటికో ఉద్యోగం హామీలు ఏమయ్యాయి? అని ఆయన ప్రశ్నించారు.
VH
Sonia Gandhi
Khammam District
Lok Sabha

More Telugu News