Harirama Jogaiah: పవన్ కల్యాణ్ కు మరో బహిరంగ లేఖ రాసిన హరిరామజోగయ్య

Harirama Jogaiah open letter to Pawan Kalyan
  • ఉమ్మడి మేనిఫెస్టోకు పలు అంశాలను సూచించిన జోగయ్య
  • వైసీపీ కంటే మెరుగైన సంక్షేమ పథకాలను అమలు చేయాలని సూచన
  • వృద్ధులకు రూ. 4 వేల పెన్షన్ ఇవ్వాలన్న జోగయ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఇప్పటికే పలు లేఖలు రాసిన మాజీ మంత్రి, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామజోగయ్య తాజాగా మరో లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ఆయన పవన్ దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో తాను సూచిస్తున్న అంశాలను పరిశీలించాలని ఆయన సూచించారు. జగన్ ను ఓడించాలంటే వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కంటే మెరుగైన పథకాలను అమలు చేయాలని చెప్పారు. 

వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసరాల ధరలు, ఇతర ఛార్జీలు భారీగా పెరిగాయని... వాటి నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రతి కుటుంబానికి రూ. 2 వేలు అందేలా చూడాలని సూచించారు. తెల్ల రేషన్ కార్డు ఆధారంగా కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది వృద్ధులు ఉన్నా... నెలకు రూ. 4 వేల పెన్షన్ అందించాలని అన్నారు. తెల్లకార్డు ఉన్న కుటుంబాల్లోని 18 ఏళ్లు దాటిన విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా ఎలక్ట్రికల్ స్కూటీలను ఇవ్వాలని సలహా ఇచ్చారు. అలాగే విద్యుత్ బిల్లులపై 20 శాతం సబ్సిడీ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.
Harirama Jogaiah
Pawan Kalyan
Janasena

More Telugu News