Damodara Raja Narasimha: ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తాం: తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ

Will fullfill six guarentees says damodara
  • ఆందోల్ ప్రజలు తనకు సేవ చేసే అవకాశం ఇచ్చారన్న దామోదర రాజనర్సింహ
  • ఆందోల్‌ను అభివృద్ధిలో ముందంజలో ఉంచేందుకు ప్రయత్నిస్తానని హామీ
  • ప్రజాపాలన ద్వారా అందరికీ న్యాయం చేస్తామని వెల్లడి

ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో ప్రజా పాలన - అభయహస్తం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రజల నుంచి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆందోల్ నియోజకవర్గ ప్రజలు తనకు సేవ చేసే అవకాశం ఇచ్చారని.. అందుకు వారికి రుణపడి ఉంటానన్నారు. ఆందోల్‌ను అభివృద్ధిలో ముందంజలో ఉంచేందుకు ప్రయత్నిస్తానని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. ప్రజాపాలన ద్వారా ప్రజలకు.. అర్హులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు.

  • Loading...

More Telugu News