Ashritha Vemuganti: అనుష్క సలహాలనే పాటిస్తున్నాను: ఆశ్రిత వేముగంటి

Ashritha Vemuganti Interview
  • 'బహుబలి 2' పాటలో మెరిసిన ఆశ్రిత వేముగంటి 
  • ఆ తరువాత పేరు తెచ్చిపెట్టిన 'యాత్ర' మూవీ
  • నచ్చిన పాత్రలకే ఓకే చెబుతున్నానని వెల్లడి 
  • అనుష్క సూచనలనే పాటిస్తున్నట్టు వివరణ

ఆశ్రిత వేముగంటికి భారతనాట్యంలోను .. కూచిపూడిలోను మంచి ప్రవేశం ఉంది. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు.  అయితే 'బాహుబలి 2'లో 'కన్నా నిదురించరా .. ' అనే పాటతోనే ఆమె అందరికీ తెలిశారు. ఆ పాటకి ఆమె ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచారు.  ఆ తరువాత కూడా ఆమె 'యాత్ర' .. 'డియర్ కామ్రేడ్' .. 'క్రాక్' తదితర సినిమాలలో చేశారు. 

తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆశ్రిత వేముగంటి మాట్లాడుతూ, 'బాహుబలి 2' తరువాత నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నాకు నచ్చినవి... చేసినవి చాలా తక్కువ. కొన్ని సినిమాల్లో నా పాత్ర గురించి చెప్పినదానికి .. తెరపై చూపించిన దానికి కాస్త తేడా కనిపించింది" అని అన్నారు. 

గోపీచంద్ మలినేని గారు మాత్రం 'క్రాక్' సినిమా కోసం ఏదైతే చెప్పారో .. అలాగే చూపించారు. ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. వ్యక్తిగతమైన .. వృత్తి పరమైన విషయాలను ఎలా బ్యాలెన్స్ చేయాలనే విషయంలో అనుష్క గారు నాకు ఇచ్చిన సలహాలనే నేను పాటిస్తూ వెళుతున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News