Revanth Reddy: కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy meets Hardeep singh puri
  • హర్దీప్ సింగ్ పూరీని మర్యాదపూర్వకంగా కలిసిన రేవంత్ రెడ్డి
  • కేంద్రమంత్రికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించిన ముఖ్యమంత్రి
  • పలువురు కేంద్రమంత్రులతోనూ భేటీ కానున్న సీఎం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి... కేంద్రమంత్రికి శాలువా కప్పి... పుష్పగుచ్ఛం అందించారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. అనంతరం జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌తోనూ భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. ఉదయం ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం కోసం ఢిల్లీ వచ్చిన రేవంత్ రెడ్డి కేంద్రమంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు.
Revanth Reddy
Congress
Telangana

More Telugu News