కూతురు పెళ్లిలో మాజీ భార్యకు ముద్దిచ్చిన ఆమిర్ ఖాన్.. వీడియో ఇదిగో!
- బుధవారం రాత్రి ముంబైలో ఆమిర్ ఖాన్ కూతురు వివాహం
- ఫిట్ నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరెను పెళ్లాడిన ఇరా ఖాన్
- కొడుకు ఆజాద్ తో కలిసి వచ్చిన ఆమిర్ మాజీ భార్య కిరణ్ రావు
అనంతరం మాజీ భార్య కిరణ్ రావును పలకరించిన ఆమిర్ ఖాన్.. ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దిచ్చారు. వరుడు నుపుర్ తల్లితో కలిసి అందరూ ఫొటోలకు పోజిచ్చారు. సినీ నిర్మాత కిరణ్ రావును ఆమిర్ పదిహేనేళ్ల క్రితం పెళ్లాడారు. 2021లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే, కొడుకు ఆజాద్ పెంపకం బాధ్యతలను కలిసి పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా తరచూ మాజీ భార్యను, కొడుకును ఆమిర్ కలుస్తుంటారు.