నన్ను 'సైంధవ్' అంటారో .. సైకో అని పిలుస్తారో మీ ఇష్టం: హీరో వెంకటేశ్
- సంక్రాంతి బరిలో నిలిచిన 'సైంధవ్'
- ఈ నెల 13వ తేదీన భారీ రిలీజ్
- మరింత ఆసక్తిని పెంచిన ట్రైలర్
- తన కెరియర్లో బెస్ట్ ఫిల్మ్ అవుతుందన్న వెంకీ
ఈవెంటులో వెంకటేశ్ మాట్లాడుతూ .. "ఈ సినిమా తరువాత నన్ను 'సైంధవ్' అని పిలవండి .. లేదంటే 'సైకో' అని పిలవండి. న్యూ ఇయర్లో ఈ సినిమా నుంచి ట్రైలర్ వదలడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా కూడా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది. సంక్రాంతి రోజున ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం" అని అన్నారు.
"75వ సినిమాగా 'సైంధవ్' చేయడం ఆనందంగా ఉంది. ఈ సారి పూర్తి డిఫరెంట్ గా అనిపించే సినిమా చేయాలని అనుకున్నాను. అలాంటి ఒక కథగానే ఇది నా ముందుకు వచ్చింది. సినిమా మొదలైన 15వ నిమిషం నుంచే కథలో ఇన్వాల్వ్ అవుతారు. నా కెరియర్లోనే ఇది బెస్ట్ ఫిల్మ్ అవుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పారు.