Ponnam Prabhakar: దీపా దాస్ మున్షీకి అభినందనలు తెలిపిన పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar congratulates newly appointed AICC in charge of Telangana Deepa
  • తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జీగా దీపా దాస్ మున్షీ
  • సీనియర్ నేత ప్రియరంజన్ దాస్ మున్షీ భార్య దీపా దాస్ మున్షీ
  • మాణిక్ రావ్ ఠాక్రే స్థానంలో దీపా నియామకం
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జీగా నియమితులైన దీపా దాస్ మున్షీని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి అభినందించారు. పుప్షగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని పొన్నం ప్రభాకర్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు. వీడియోను షేర్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇన్ఛార్జీగా ఉన్న మాణిక్ రావ్ ఠాక్రే స్థానంలో దీపాను హైకమాండ్ నియమించింది. పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్ మున్షీ భార్యే దీపా దాస్ మున్షీ. మాణిక్ రావ్ ఠాక్రేను పార్టీ అధిష్ఠానం గోవా, డయూ డామన్ వ్యవహారాల ఇన్ఛార్జీగా నియమించింది.
Ponnam Prabhakar
Deepa Dasmunshi
Congress

More Telugu News