Logo: 'రా... కదలిరా' పేరిట టీడీపీ సైకిల్, జనసేన గ్లాసుతో ప్రత్యేక లోగో

Special logo with TDP Cycle and Janasena glass symbol
  • చంద్రబాబు భవిష్యత్ కార్యక్రమాలపై అచ్చెన్నాయుడు వివరణ
  • మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం
  • పోస్టర్ ఆవిష్కరించిన అచ్చెన్నాయుడు
ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండడంతో టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. 

ఇవాళ మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు భవిష్యత్ కార్యక్రమాలపై అచ్చెన్నాయుడు వివరించారు. 

ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక లోగో కనిపించింది. చంద్రబాబు బొమ్మతో 'రా... కదలిరా' పేరిట ఏర్పాటు చేసిన పోస్టర్లలో టీడీపీ సైకిల్, జనసేన గ్లాసు పక్కపక్కనే కనిపించాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, దేవినేని ఉమా, పార్టీ నేత అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Logo
TDP
Cycle
Jansena
Glass
Andhra Pradesh

More Telugu News