Powerball Game: మిలియన్ డాలర్ల లాటరీ గెలుచుకున్న మహిళ.. ఆనందం తట్టుకోలేక స్టేజిపైనే కుప్పకూలిన వైనం!

US woman collapses on stage after winning million dollars in lottery
  • న్యూ ఇయర్ సందర్భంగా లాటరీ 
  • ‘పమేలా యూ ఆర్ ఏ మిలియనీర్’ అని ప్రకటించిన నిర్వాహకులు
  • కిందపడిన ఆమెను లేపిన నిర్వాహకులు, కుమార్తె
  • ఆ డబ్బుతో ఇల్లు కొనుక్కుంటానన్న పమేలా
అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన ఓ మహిళ న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించిన లాటరీలో మిలియన్ డాలర్లు గెలుచుకుంది. నిర్వాహకులు ఆ విషయం ప్రకటించగానే ఆనందం తట్టుకోలేక స్టేజిపైనే కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

లాటరీ గెలుచుకున్న ఆమె పేరు పమేలా బ్రాడ్‌షా. గతంలో ఎప్పుడూ న్యూయార్క్ సందర్శించని ఆమె స్టేట్ లాటరీ ద్వారా న్యూయార్క్ సందర్శించే వీఐపీ ట్రిప్‌ను సొంతం చేసుకుంది. మిలియన్ డాలర్లు గెలుపొందే అవకాశం కోసం దేశవ్యాప్తంగా మొత్తం ఐదుగురిని పవర్‌బాల్ ప్లేయర్లను ఎంపిక చేశారు. వారిలో పమేలా ఒకరు. బంతులన్నీ మిషిన్‌లో తిరిగాక ఓ బంతిని తీసి వదిలితే అది పమేలా నంబర్ అయిన ఒకటి (1)ని ప్రదర్శించింది.

‘పమేలా యూ ఆర్ ఏ మిలియనీర్’ అని నిర్వాహకులు గేమ్ అనంతరం ప్రకటించగానే ఆమె ఆనందం పట్టలేకపోయింది. స్టేజిపైనే అమాంతం పడిపోయింది. వెంట ఉన్న ఆమె కుమార్తెతోపాటు నిర్వాహకులు ఆమెను పైకి లేపారు. ఆ తర్వాత కూడా ఆమె ‘ఓ మై గాడ్’ అంటూ తనను తాను నమ్మలేకపోయింది. తనకు వచ్చిన డబ్బుతో ఒకటిరెండు బెడ్రూములు ఉన్న కొత్త ఇల్లు కొనుక్కుంటానని, అంతకుమించి తనకు కలలు ఏవీ లేవని పమేలా తెలిపింది.
Powerball Game
North Carolina
Million Dollars Lottery

More Telugu News