నోయిడాలో దారుణం.. షాపింగ్‌మాల్ సమీపంలో మహిళపై సామూహిక లైంగికదాడి.. నిందితులు పేరున్నవారే!
- బాధిత మహిళపై గతంలోనే అఘాయిత్యం
- ఈ నెల 30న మరోమారు మహిళకు ఫోన్ చేసి బ్లాక్‌మెయిలింగ్
- ముగ్గురు నిందితుల అరెస్ట్
- పరారీలో మరో ఇద్దరు
బాధితురాలిపై గతంలో సామూహిక లైంగికదాడికి పాల్పడినవారు డిసెంబరు 30న మరోమారు బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధింపులకు పాల్పడడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని రాజ్‌కుమార్, ఆజాద్, వికాస్‌గా గుర్తించారు. రవి, మేహ్మి పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. అరెస్ట్ అయిన నిందితులకు స్థానిక కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.