బిర్యానీ తిని రూ. 7 లక్షల విలువైన కారు గెలుచుకున్న అదృష్టవంతుడు!
- గత రాత్రి లక్కీ డ్రా నిర్వహించిన రోబో హోటల్
- నిరుడు సెప్టెంబర్ ప్రత్యేక పథకం పెట్టిన హోటల్ యజమాని భరత్‌కుమార్‌రెడ్డి
- 23 వేలకుపైగా కూపన్ల అందజేత
- నిస్సాన్ మాగ్నైట్ కారు గెలుచుకున్న రాహుల్
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని గత రాత్రి హోటల్ అధినేత భరత్‌కుమార్‌రెడ్డి, నీలిమ దంపతులు హోటల్ ఆవరణలో లక్కీ డ్రా తీశారు. ఇందులో నగరానికే చెందిన రాహుల్ విజేతగా నిలిచాడు. ఆ వెంటనే రాహుల్‌కు ఫోన్ చేసి విషయం చెప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భరత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇకపైనా ఇలాంటి పథకాలు కొనసాగిస్తామని తెలిపారు.