ఐఐటీ విద్యార్థిని వివస్త్రను చేసి, వీడియో తీసి లైంగిక వేధింపులు.. పార్టీ నుంచి ముగ్గురు బీజేపీ కార్యకర్తల బహిష్కరణ
- ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఘటన
- ఐఐటీ-బీహెచ్‌యూ క్యాంపస్‌లోనే వేధింపులు
- రెండు నెలల తర్వాత విషయం వెలుగులోకి
- విద్యార్థుల ఆందోళనతో నిందితుల అరెస్ట్
ఐఐటీ-బనారస్ హిందూ యూనివర్సిటీ విద్యార్థిని నవంబరు 2 తెల్లవారుజామున లైంగిక వేధింపులకు గురైంది. బైక్‌పై వచ్చిన నిందితులు క్యాంపస్‌లోనే ఆమెపై వేధింపులకు పాల్పడ్డారు. నిందితులు ఆమె దుస్తులు విప్పి ఆ ఘటనను వీడియో తీశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఐఐటీ-బీహెచ్‌యూ విద్యార్థి సంఘం ఆందోళనలు చేసింది. బాధితురాలికి న్యాయం కావాలని డిమాండ్ చేసింది. క్యాంపస్‌లో భద్రత పెంచాలని ఆందోళనకు దిగారు. ఈ ఘటన యూపీలో రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది. సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బీజేపీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. నిందితులకు పార్టీ అండగా నిలుస్తోందని ఆరోపించారు.