Rahul Gandhi: 2023కి వీడ్కోలు పలుకుతూ... తల్లికి ఇష్టమైన తియ్యని వంటకం చేసిన రాహుల్ గాంధీ... వీడియో ఇదిగో!

Rahul Gandhi makes Orange Marmalade for his mother Sonia Gandhi
  • సోనియాగాంధీకి ఇష్టమైన వంటకం ఆరెంజ్ మార్మలేడ్
  • మేకింగ్ వీడియో పంచుకున్న రాహుల్ గాంధీ
  • అది తన సోదరి రెసిపీ అని వెల్లడి

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన యూట్యూబ్ చానల్లో ఆసక్తికరమైన వీడియో పంచుకున్నారు. రాహుల్ గాంధీ తన తల్లి, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఇష్టమైన వంటకాన్ని తయారు చేయడం ఆ వీడియోలో చూడొచ్చు. నారింజ ఫలాలతో తయారుచేసే ఆ వంటకం పేరును రాహుల్ ఆరెంజ్ మార్మలేడ్ (జామ్) గా పేర్కొన్నారు. 

వాస్తవానికి ఆ రెసిపీ తన సోదరి ప్రియాంక గాంధీదని వెల్లడించారు. అంతేకాదు, ఆమె ఈ వంటకాన్ని అద్భుతంగా చేస్తుందని కితాబిచ్చారు. అయితే, 2023కి తియ్యటి వీడ్కోలు పలుకుతూ, ఈసారికి ఆరెంజ్ మార్మలేడ్ వంటకాన్ని తాను తయారుచేస్తున్నానని తెలిపారు. 

ఇక, తల్లితో కలిసి తోటలోకి వెళ్లి ఆరెంజ్ ఫలాలను కోసుకొచ్చి స్వయంగా జామ్ తయారుచేసిన రాహుల్... ఆ జామ్ ను తల్లితో కలిసి బాటిళ్లలో నింపారు.

  • Loading...

More Telugu News