Revanth Reddy: నిర్బంధాలు, ఇనుప కంచెలు తొలగిపోయాయి... 2024లో ప్రతి పౌరుడి ఆకాంక్షలు నెరవేరాలి: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy wishes Telangana people on new year eve
  • తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సరాది సంరంభం
  • తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
  • 2024ను రైతు-మహిళ-యువత నామసంవత్సరంగా అభివర్ణించిన వైనం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పౌరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇనుప కంచెలు, నిర్బంధాలు 2023లో తొలగిపోయాయని, కొత్త సంవత్సరంలో ప్రతి పౌరుడి ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. అన్ని వర్గాల సహకారంతో ప్రజాప్రభుత్వం కొలువుదీరిందని, 2024ను రైతు-మహిళ-యువత నామసంవత్సరంగా సంకల్పం తీసుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు.

అటు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఏడాదిలో ప్రజల జీవితాల్లో ఆనందం నిండాలని అభిలషించారు. 

ఇంటింటా కాంతులు వెల్లివిరియాలి: భట్టి

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రజలకు 2024 సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. 2024లో ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
Revanth Reddy
New Year-2024
Telangana
Congress

More Telugu News