New Year-2024: నవశకం వైపు నడుద్దాం: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్, బాలకృష్ణ

  • నూతన సంవత్సరాది సందర్భంగా స్పందించిన టీడీపీ అగ్రనేతలు
  • నవ వసంతంపై జనసంతకం చేద్దామన్న లోకేశ్
  • కొత్త ఏడాది అందరి కలలు సాకారం కావాలన్న బాలకృష్ణ
  • రాక్షస పాలనకు 2024లో విముక్తి కలుగుతుందన్న అచ్చెన్నాయుడు
Lokesh and Balakrishna wishes people on New Year eve

నూతన సంవత్సర ఆగమన వేళ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. 

"నవ వసంతంపై జన సంతకం చేద్దాం. నవశకం వైపు నడుద్దాం. 2023కి వీడ్కోలు గతం కాదు, గుణపాఠం. 2024కి స్వాగతం, ఆశయసాధనకి అవకాశం. కొత్త ఏడాది అందరి జీవితాల్లో ఆయురారోగ్య ఆనందాలు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ నారా లోకేశ్" అంటూ టీడీపీ యువనేత సందేశం అందించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

నందమూరి బాలకృష్ణ కూడా ఓ ప్రకటన చేశారు. "ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరికి నూతన ఏడాది సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి... నూతన సంవత్సరానికి హృదయపూర్వక స్వాగతం పలుకుదాం. ఈ ఏడాదిలో అందరి కలలు సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు.


నూతన ఏడాదిలో రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి: అచ్చెన్నాయుడు

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. నూతన ఏడాదిలో జగన్ రెడ్డి రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి కలుగుతుంది. ప్రజలకు పండుగలను దూరం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. ప్రజలపై పన్నులు, ఇతర భారాలు మోపారు. 2024 ప్రతి ఒక్కరికి కీలకమైన సంవత్సరం. తెలుగు ప్రజలు అన్ని రంగాలలో పురోభివృద్ధి సాధించేలా నూతన ఏడాది నాంది పలకాలని కోరుకుందాం. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. 

More Telugu News