Jagan: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు: సీఎం జగన్

CM Jagan conveys new year greetings to all Telugu people across the world
  • మరి కొన్ని గంటల్లో నూతన సంవత్సరాది
  • 2024లోకి అడుగుపెడుతున్నాం అంటూ  సీఎం జగన్ ప్రకటన
  • ప్రతి ఇంటా అభివృద్ధి, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్ష
నూతన సంవత్సరం రాబోతున్న వేళ ఏపీ సీఎం జగన్ ప్రజలకు శుభకాంక్షలు తెలిపారు. "కొత్త సంవత్సరం 2024లోకి అడుగుపెడుతున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024లో ప్రతి ఇంటా అభివృద్ధి, ఆనందం వెల్లివిరియాలి. అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలు సుస్థిర అభివృద్ధి పథంలో పయనించేలా కృషి చేస్తున్న ప్రభుత్వానికి, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికీ 2024లో సంపూర్ణ దైవానుగ్రహం లభించాలని ఆకాంక్షిస్తున్నా" అంటూ సీఎం జగన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Jagan
New Year
2024
Greetings
YSRCP
Andhra Pradesh

More Telugu News