K.Raghavendra Rao: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

Senior director K Raghavendra Rao met Telangana CM Revanth Reddy
  • హైదరాబాదులో రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన రాఘవేంద్రరావు
  • తెలంగాణ సీఎంతో మర్యాదపూర్వక భేటీ
  • సోషల్ మీడియాలో వెల్లడించిన తెలంగాణ కాంగ్రెస్
టాలీవుడ్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇవాళ హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన రాఘవేంద్రరావు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య సినీ రంగానికి చెందిన పలు అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటో, వీడియోను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. సీఎం రేవంత్ రెడ్డిని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నాగార్జున-అమల దంపతులు కూడా కలిసిన సంగతి తెలిసిందే.
K.Raghavendra Rao
CM Revanth Reddy
Hyderabad
Tollywood
Congress
Telangana

More Telugu News