Ayodhya: రేపటి నుంచి ఇంటింటికీ రాముడి అక్షింతలు

From January1 Ram lallah Akshat Will Be Distributed Door to Door
  • ఈ నెల 22న రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ
  • శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్
  • జన సంపర్క అభియాన్ కార్యక్రమం
బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దేశవ్యాప్తంగా జన సంపర్క అభియాన్ కార్యక్రమం చేపట్టింది. అయోధ్య నుంచి వచ్చిన రాముడి అక్షింతలను ఇంటింటికీ చేర్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈమేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి జనవరి 15 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

రాముడి అక్షింతలతో పాటు చిత్రపటం, మందిరం నమూనా కరపత్రాన్ని ఇంటింటీకీ చేర్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పండరీనాథ్, జన సంపర్క అభియాన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్, రామ్ సింగ్, నరసింహమూర్తి, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
Ayodhya
Ram lallah
Akshat
Ram mandir
jana sampark Abhiyan

More Telugu News