YSRCP: సీఎం జగన్ ఆదేశాలతో అమెరికాలో వైసీపీ సోషల్ మీడియా కమిటీ నియామకం

YCP Social media committee in USA announced
  • ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా విభాగంపై దృష్టి సారించిన సీఎం జగన్
  • 36 మందితో అమెరికా వైసీపీ సోషల్ మీడియా కమిటీ నియామకం
  • కమిటీ కన్వీనర్ గా గంగిరెడ్డిగారి రోహిత్
విదేశాల్లోనూ వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేయడంపై సీఎం జగన్ దృష్టి సారించారు. తాజాగా అమెరికాలో వైసీపీ సోషల్ మీడియా కమిటీని నియమించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు 36 మందితో అమెరికా వైసీపీ సోషల్ మీడియా కమిటీ కార్యవర్గాన్ని ప్రకటించారు. 

గంగిరెడ్డిగారి రోహిత్ ను ఈ కమిటీకి కన్వీనర్ గా గా నియమించారు. పల్లేటి ఆదిత్య, చిల్లా కిరణ్ కుమార్, బంకా తేజ్ యాదవ్, మైలం సురేశ్ లు కమిటీ సహ కన్వీనర్లుగా నియమితులయ్యారు. ఈ కమిటీలో సలహా బృందం, ప్రాపర్టీస్ మేనేజ్ మెంట్, నెట్ వర్క్ మేనేజ్ మెంట్, డిస్ట్రిబ్యూషన్ మేనేజ్ మెంట్, ఇన్ ఫ్లుయెన్సర్ మేనేజ్ మెంట్ విభాగాలు కూడా ఉన్నాయి.
YSRCP
Social Media
Committee
Jagan
Andhra Pradesh

More Telugu News