ఓలా, ఉబర్, గిగ్ వర్కర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త
- రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ
- డిసెంబర్ 23న గిగ్ వర్కర్లతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి
- భద్రత సహా పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లిన గిగ్ వర్కర్లు
గతవారం సీఎంతో భేటీ సందర్భంగా గిగ్ వర్కర్ల భద్రత సహా పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో వారికి ప్రమాద బీమా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. టీ హబ్ ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ల కోసం యాప్‌ను అందుబాటులోకి తీసుకు వస్తామని సీఎం తెలిపారు. అంతేకాదు, ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించే గ్రామ, వార్డు సభలలో గిగ్ వర్కర్లు తమ వివరాలతో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు.