Revanth Reddy: అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్... వీడియో ఇదిగో

CM Revanth Reddy convoy make way to ambulance
  • సీఎం కాన్వాయ్ కేబీఆర్ పార్క్ రోడ్డు మీదుగా వెళ్తుండగా ఘటన
  • కాన్వాయ్ వెళ్తుండగా వెనుక అంబులెన్స్‌ను గమనించి దారి ఇచ్చిన రేవంత్ రెడ్డి కాన్వాయ్
  • నెట్టింట వైరల్‌గా మారిన వీడియో

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ శనివారం ఓ అంబులెన్స్‌కు దారి ఇచ్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ రోడ్డులో కనిపించింది. ఈ రోజు మధ్యాహ్నం 11.45 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబీఆర్ పార్క్ రోడ్డు మీదుగా వెళ్తున్నారు. ఆ సమయంలో అంబులెన్స్ రావడంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ దారి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులపై అధికారులకు కీలక సూచనలు చేశారు. తాను వస్తున్నానని చెప్పి ప్రజలను గంటలకొద్దీ ఆపివేయవద్దని ట్రాఫిక్ అధికారులకు సూచించారు. తన రాకకు కొద్దిసేపు ముందు నిలిపివేస్తే చాలని చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి ప్రజల మన్ననలు చూరగొన్నారు. ఇప్పుడు అంబులెన్స్‌కు దారి ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

  • Loading...

More Telugu News