metro rail: హైదరాబాద్ వాసులకు మెట్రో రైలు శుభవార్త... రేపు అర్ధరాత్రి దాకా రైలు

Good News to Hyderabadies on Metro train
  • న్యూఇయర్ సందర్భంగా మెట్రో రైలు సర్వీసుల సమయం పెంపు
  • డిసెంబర్ 31 అర్ధరాత్రి 12.15 గంటలకు చివరి స్టేషన్ వద్ద మెట్రో రైలు ప్రారంభం
  • అర్ధరాత్రి ఒంటి గంటకు గమ్యస్థానానికి చేరుకుంటుందని మెట్రో రైల్ ఎండీ వెల్లడి

న్యూఇయర్ వేడుకలు జరుపుకునే హైదరాబాదీలకు హైదరాబాద్ మెట్రో రైల్ శుభవార్త చెప్పింది. కొత్త సంవత్సరం సందర్భంగా రేపు అర్ధరాత్రి వరకు రైళ్లను నడపాలని మెట్రో రైల్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 31, ఆదివారం రాత్రి హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పొడిగించినట్లు తెలిపింది. రేపు అర్ధరాత్రి 12.15 గంటల వరకు మెట్రో సర్వీసులు నడుపుతున్నామని మెట్రో రైలు ఎండీ వెల్లడించారు. చివరి రైలు ఆయా స్టేషన్ల నుంచి 12.15 నిమిషాలకు బయలుదేరుతుందని తెలిపారు. అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ రైలు గమ్యస్థానానికి చేరుకుంటుందని తెలిపారు.

  • Loading...

More Telugu News