Vijayashanti: దండుపాళ్యం బ్యాచ్ దోపిడీ లెక్కలు చెప్పాల్సిందే: విజయశాంతి

Vijayashanthi demands explanation from kcr over lavish spending on buying 22 cars for convoy
  • కేసీఆర్ టార్గెట్‌గా నెట్టింట కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శలు
  • కాన్వాయ్‌ కోసం 22 కార్ల కొనుగోలుపై సమాధానం చెప్పాలంటూ డిమాండ్
  • దోపిడీ లెక్కలకు సమాధానం వచ్చే వరకూ అడుగుతూనే ఉంటామని స్పష్టీకరణ
సీఎం కాన్వాయ్ కోసం 22 కార్లు కొనుగోలు చేశారన్న వార్తలపై మాజీ సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి నెట్టింట డిమాండ్ చేశారు. బండెనక బండి కట్టి అని పాడుకున్న తెలంగాణ ఇప్పుడు బండెనక బండి కొన్నది ఎందుకంటూ ప్రశ్నిస్తోందని ఎద్దేవా చేశారు. దోచుకున్న డబ్బుకు దొరలు లెక్క చెప్పకపోతే ఊరుకోమని హెచ్చరించారు. సమాధానం వచ్చే వరకూ ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు విజయ‌శాంతి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. 

"బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి " అని నాడు తెలంగాణల మారుమోగిన గీతం, ఇయ్యాల "బండెనక బండి కొని బాయీసు(22) బండ్లు కొని ఏ బండిలెల్లదమని దొరగారు" అన్న తీరుగా తిరిగి అడగవలసి వచ్చింది. ఈ 22 కార్ల కొనుగోలుకై కేసీఆర్ గారు సుమారు 100 కోట్ల రూపాయల ప్రజాధన దుర్వినియోగం గురించి సీఎం గారు చెప్పింది విన్నంక. లక్షల కోట్ల అవినీతి, ప్రాజెక్టులు, ధరణి కుంభకోణాలు, ఇసుక మాఫియా దోపిడికి సమాధానం ఇప్పటికీ లేదు, ఈ కార్లు కొని దాచిపెట్డుడు ఇంకో సిగ్గుపడాల్సిన అంశం. దండుపాళ్యం దోపిడి బ్యాచ్ లెక్క, దొరలు అందిన అన్నింటా దోచుకుని, ఇప్పుడు చప్పుడు చెయ్యం సమాధానం చెప్పం అంటే నడవదు...మీరు జనం ముందుకెళ్లాలంటే, సమాధానం చెప్పి వెళ్లాలి, అప్పటిదాకా ఎన్నిసార్లైనా అడుగుతనే ఉంటాం..మల్లా మల్లా అడుగుతూనే ఉంటాం..’’ అని పోస్ట్ పెట్టారు.
Vijayashanti
Congress
KCR
BRS
Telangana

More Telugu News