Sandeep Lamichhane: అత్యాచారం కేసులో దోషిగా తేలిన నేపాల్ క్రికెటర్‌!

Sandeep lamichhane found guilty of rap
  • నేపాల్ క్రికెటర్‌ సందీప్ లామిచానేపై అత్యాచార ఆరోపణలు
  • గతేడాది హోటల్‌లో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక ఫిర్యాదు
  • ఈ కేసులో కోర్టు తాజాగా తీర్పు, ఘటన సమయంలో బాధితురాలు మైనర్ కాదని వెల్లడి
  • వచ్చే ఏడాది జనవరి 10న నిందితుడికి శిక్ష ఖరారు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపాల్ మాజీ కెప్టెన్ సందీప్‌ లామిచానేని ఖాట్మండూ జిల్లా కోర్టు దోషిగా తేల్చింది. అయితే, ఘటన జరిగిన సమయంలో బాధితురాలు మైనర్ కాదని వెల్లడించింది. జనవరి 10న లామిచానేకు శిక్ష ఖరారు కానుంది. 

గతేడాది ఆగస్టు 21న ఖాట్మండూలోని ఓ హోటల్‌లో లామిచానే తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడంటూ 17 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మభ్యపెట్టి దారుణానికి పాల్పడ్డాడని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతణ్ణి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. 

ఆ సమయంలో కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న లామిచానే స్వదేశానికి తిరిగి రాకపోవడంతో నేపాల్ పోలీసులు ఇంటర్‌‌పోల్‌ను ఆశ్రయించారు. దీంతో, వారు లామిచానేను నేపాల్‌ పోలీసులకు అప్పగించారు. అనంతరం అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ క్రమంలో కోర్టు లామిచానేను దోషిగా తేలుస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. త్వరలో శిక్ష ఖరారు కానుంది. 

ఐపీఎల్ ఆడిన తొలి నేపాల్ క్రికెటర్‌గా లామిచానే. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అతడు బరిలోకి దిగాడు.

  • Loading...

More Telugu News