Nara Lokesh: షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ పంపడంపై నారా లోకేశ్ స్పందన

Nara Lokesh reacts to media questions about Christmas gift from YS Sharmila
  • క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు కుటుంబానికి షర్మిల నుంచి కానుకలు
  • రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన వైనం
  • ఇదే అంశంపై లోకేశ్ ను ప్రశ్నించిన మీడియా
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నారా లోకేశ్ కు వైఎస్సార్టీపీ అధినేత షర్మిల కానుకలు పంపిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించాలంటూ మీడియా నారా లోకేశ్ ను కోరింది. ఓ మీడియా ప్రతినిధి "షర్మిల మీకు క్రిస్మస్ గిఫ్ట్ పంపించినట్టు అనుకుంటున్నారు" అని అడగ్గా, నారా లోకేశ్ నవ్వేశారు. "అనుకోవడం ఏంటండీ.... ఆమె పంపించారు... దానిపై నేను ట్వీట్ చేశాను కూడా" అని వివరణ ఇచ్చారు. ఎందుకు పంపారని మరో విలేకరి ప్రశ్నించగా, "ఆ విషయం నన్నెందుకు అడుగుతారండీ, గిఫ్ట్ అందిందని చెప్పానంతే" అని లోకేశ్ వెల్లడించారు. కాగా, చంద్రబాబు కుటుంబానికి షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ పంపడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Nara Lokesh
YS Sharmila
Christmas Gift
TDP
YSRTP
Andhra Pradesh
Telangana

More Telugu News