Pothina Venkata Mahesh: ఈ పేర్లు జగన్ కు కచ్చితంగా సరిపోతాయి: జనసేన నేత పోతిన మహేశ్

Janasena leader Pothina Mahesh counters CM Jagan remarks on Pawan Kalyan
  • దత్తపుత్రుడు అంటూ భీమవరంలో సీఎం జగన్ విమర్శలు
  • కార్లను మార్చినట్టు భార్యలను మార్చుతాడని వ్యాఖ్యలు
  • రాష్ట్రంలో ఏమాత్రం విలువల్లేని వ్యక్తి జగనే అంటూ పోతిన మహేశ్ కౌంటర్
  • పవన్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తే మహిళలే జగన్ ను తరిమికొడతారని స్పష్టీకరణ
దత్తపుత్రుడు కార్లను మార్చినట్టు భార్యలను మార్చుతాడంటూ సీఎం జగన్ భీమవరంలో చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత పోతిన వెంకట మహేశ్ బదులిచ్చారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే సీఎం జగన్ మతిభ్రమించినట్టు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. 

రాష్ట్రంలో ఏమాత్రం విలువలు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగనే అని విమర్శించారు. దరిద్ర పుత్రుడు, అప్పుల అప్పారావు, చంచల్ గూడ స్టార్, మార్టిగేజ్ స్టార్ అనే పేర్లు జగన్ కు అతికినట్టు సరిపోతాయని పోతిన మహేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు. 

మహిళలను ఆటవస్తువులుగా భావించే జగన్... తల్లిని, చెల్లిని ఇంట్లోంచి గెంటేశాడని ఆరోపించారు. పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తే జగన్ ను రాష్ట్రంలోని మహిళలే తరిమికొడతారని స్పష్టం చేశారు.
Pothina Venkata Mahesh
Pawan Kalyan
Jagan
Janasena
YSRCP
Andhra Pradesh

More Telugu News