BJP: మంత్రి రజని సభలో బీజేపీ నేతల నిరసనలు... బయటకు పంపించిన పోలీసులు

BJP leaders protests against minister Vidadala Rajini
  • గుంటూరు జిల్లా పొన్నూరులో వికసిత భారత్ సంకల్ప సభ
  • హాజరైన కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ, రాష్ట్రమంత్రి విడదల రజని
  • కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ప్రధాని పేరు ప్రస్తావించలేదంటూ బీజేపీ నేతల నినాదాలు
  • సభలో గందరగోళం
గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన వికసిత భారత్ సంకల్ప సభలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని పాల్గొన్నారు. అయితే ఈ సభలో మంత్రి రజనికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నిరసనలు తెలిపారు. 

కేంద్ర ప్రథకాల్లో ప్రధాని పేరు ప్రస్తావించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రజని ప్రసంగానికి అడ్డుతగిలారు. బీజేపీ నేతల నినాదాలతో సభలో గందరగోళం ఏర్పడింది. దాంతో మంత్రి రజని తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. 

ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా పాల్గొన్నారు. దాంతో, తమ అసంతృప్తిని బీజేపీ నేతలు మన్సుఖ్ మాండవీయ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయన వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో, పోలీసులు జోక్యం చేసుకుని సభ నుంచి బీజేపీ నేతలను బయటికి పంపించివేశారు.
BJP
Vidadala Rajini
Ponnur
Vikasita Bharat Sankalp
YSRCP
Andhra Pradesh

More Telugu News