Revanth Reddy: సలార్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో నాగపూర్ మీటింగ్ వీడియోను షేర్ చేసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy tweets Nagapur meeting video with Salar BGM
  • నిన్న నాగపూర్‌లో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
  • రాహుల్ గాంధీ, తనకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన సీఎం
  • సలార్ లిరిక్స్‌నూ రాసుకొచ్చిన రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ఆవిర్భావ వేడుక సందర్భంగా నాగపూర్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. ఈ కాంగ్రెస్ వేడుక సందర్భంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు తనకు దక్కిన గౌరవాన్ని, కాంగ్రెస్ అగ్ర నేతలతో తనకు ఉన్న అనుబంధాన్ని తెలియజేసేలా రేవంత్ రెడ్డి ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీనికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌గా.. ప్రభాస్ నటించిన సలార్ మ్యూజిక్‌ను జత కలిపారు. అంతేకాదు ఈ పాటలోని లిరిక్స్‌ను కూడా రేవంత్ రెడ్డి తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. 

'వేగమొకడు… త్యాగమొకడు.... గతము మరువని గమనమే..... ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే.... ఒకరు గర్జన… ఒకరు ఉప్పెన.... వెరసి ప్రళయాలే.... సైగ ఒకరు… సైన్యం ఒకరు.... కలిసి కదిలితే కదనమే' అని రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
Revanth Reddy
Telangana
Congress

More Telugu News