Goa: కదులుతున్న కారుపై చిన్నారుల నిద్ర.. వీడియో ఇదిగో!

Man in Goa drives SUV as children sleep on its roof
  • గోవాలో షాకింగ్ ఘటన 
  • కారు టాపుపై నిద్రిస్తున్న చిన్నారులను చూసి ఆశ్చర్యపోయిన వ్యక్తి
  • డ్రైవర్‌ను అడ్డుకుని నిలదీసిన వైనం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్
  • ఘటనపై పోలీసు కేసు నమోదు
కదులుతున్న కారుపై ఇద్దరు చిన్నారులు నిద్రపోతున్న ఘటన తాలూకు వీడియో నెట్టింట కలకలానికి దారి తీసింది. ఆ చిన్నారుల తల్లిదండ్రులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోవాలో ఈ ఘటన వెలుగు చూసింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కదులుతున్న కారుపై చిన్నారులు నిద్రపోతున్న విషయాన్ని ఓ వ్యక్తి గమనించాడు. వెంటనే డ్రైవర్‌ను సమీపించి ఇదేం పని అంటూ నిలదీశాడు. 

కానీ డ్రైవర్ మాత్రం అసలేం జరగనట్టు వ్యవహరించాడు. కారును మలుపు తిప్పుతున్నా, వెనక్కు తీసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. వీడియో వైరల్‌ కావడంతో నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మాపుసా స్టేషన్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
Goa
Viral Videos

More Telugu News