MPhil Programmes: ఆ డిగ్రీకి గుర్తింపు లేదు.. అందులో చేరొద్దు: యూజీసీ హెచ్చరిక

  • ఎంఫిల్ ప్రోగ్రాములకు సంబంధించి యూనివర్సిటీలకు యూజీసీ నోటీసులు
  • ఎంఫిల్‌ డిగ్రీకి గుర్తింపు లేదని స్పష్టీకరణ
  • విద్యార్థులు ఈ ప్రోగ్రామ్స్‌లో చేరకూడదని సూచన
MPhil is not a recognised degree UGC asks students not to take admission

ఎంఫిల్ ప్రోగ్రామ్‌లకు గుర్తింపు లేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మరోసారి స్పష్టం చేసింది. వీటిల్లో చేరొద్దంటూ విద్యార్థులకు సూచించింది. కొన్ని యూనివర్సిటీలు ఇప్పటికీ ఎంఫిల్ ప్రోగ్రాముల్లో అడ్మిషన్లు చేపడుతున్నట్టు తమ దృష్టికి రావడంతో ఈ నోటీసులు జారీ చేశామని వెల్లడించింది. 

‘‘కొన్ని యూనివర్సిటీలు ఎంఫిల్ ప్రోగ్రామ్‌లల్లో అడ్మిషన్లు చేపడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఎంఫిల్‌ను ఓ డిగ్రీగా మేము గుర్తించట్లేదు. ఉన్నత విద్యాసంస్థలు ఎంఫిల్ కోర్సులు అందించకూడదని 2022 నాటి రెగ్యులేషన్ నెం.14లో స్పష్టంగా ఉంది’’ అని యూజీసీ తన నోటీసులో పేర్కొంది. 2023-24 విద్యా సంవత్సరంలో ఎంఫిల్ అడ్మిషన్లు తక్షణం నిలిపివేయాలని యూనివర్సిటీలను కోరినట్టు వెల్లడించింది. విద్యార్థులు కూడా ఆయా ప్రోగ్రామ్స్‌లో చేరొద్దని స్పష్టం చేసింది.

More Telugu News