Ram Charan: రామ్ చరణ్ అద్భుతమైన వ్యక్తి: బాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు మధుర్ భండార్కర్

Madhur Bhandarkar says Ram Charan was an amazing person
  • ముంబయి ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ ను కలిసిన మధుర్ భండార్కర్
  • ఇరువరి మధ్య చిట్ చాట్
  • సినిమాలు తప్ప మరో అంశం చర్చకు రాలేదన్న భండార్కర్
  • రామ్ చరణ్ నిరాడంబరత తనను ఎంతగానో ఆకట్టుకుందని వెల్లడి
టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ముంబయిలో పర్యటించిన సంగతి తెలిసిందే. కాగా, బాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు మధుర్ భండార్కర్ ముంబయి ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ ను కలిశారు. ఈ విషయాన్ని మధుర్ భండార్కర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

తమ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగిందని తెలిపారు. సినిమాలు, సినిమాలు... ఇవి తప్ప మరో విషయం తమ మధ్య చర్చకు రాలేదని పేర్కొన్నారు. రామ్ చరణ్ నిజంగా ఎంతో అద్భుతమైన వ్యక్తి అని, అదే సమయంలో చాలా నిరాడంబరమైన వ్యక్తి అని మధుర్ భండార్కర్ కొనియాడారు. రామ్ చరణ్ ను కలవడం నిజంగా ఆనందాన్నిచ్చిందని, ఇదొక మంచి అనుభవం అని వెల్లడించారు.
Ram Charan
Madhur Bhandarkar
Mumbai Airport
Tollywood
Bollywood

More Telugu News