YS Sharmila: రేపు ఢిల్లీకి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల?

Sharmila may go to Delhi tomorrow
  • రేపు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినం
  • ఇదే రోజు షర్మిలను పార్టీలో చేర్చుకోవాలనే యోచనలో అధిష్ఠానం!
  • ఆమె చేరికపై సానుకూలంగా స్పందిస్తున్న పార్టీ నాయకులు
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ నేతలు కూడా షర్మిల పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని చెబుతున్నారు. ఓ వైపు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతున్న సమయంలోనే... రేపు ఆమె దేశ రాజధానిలో అడుగు పెట్టనున్నారని అంటున్నారు. 

డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినం కావడంతో ఇదే రోజు షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి అధిష్ఠానం ఆసక్తిగా ఉందని అంటున్నారు. అధిష్ఠానం పూర్తిగా చర్చించిన తర్వాత... పిలుపు రాగానే ఆమె రేపు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. షర్మిలను జాతీయస్థాయిలో ఏఐసీసీలో సర్దుబాటు చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అటు, షర్మిల భర్త అనిల్ కుమార్ ఇప్పటికే ఢిల్లీ చేరుకోవడంతో ఊహాగానాలకు బలం చేకూరుతోంది.
YS Sharmila
Congress
Telangana
Andhra Pradesh

More Telugu News