Daggubati Purandeswari: అప్పుడు చంద్రన్న... ఇప్పుడు జగనన్న... కేంద్ర పథకాలకు రాష్ట్ర స్టిక్కర్లు వేసుకుంటున్నారు: పురందేశ్వరి

Purandeswari slams TDP and YCP govts
  • కేంద్ర నిధులతో పలు పథకాలు అమలవుతున్నాయన్న పురందేశ్వరి
  • వాటిపై ప్రధాని పేరు, ఫొటో కచ్చితంగా పెట్టాలని వెల్లడి
  • లేకపోతే నిధులు నిలిపివేస్తామని కేంద్రం ప్రకటించిందని స్పష్టీకరణ

కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుంటోందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరించిందని, అప్పుడు చంద్రన్న స్టిక్కర్లు వేసుకున్నారని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా జగనన్న స్టిక్కర్లు వేసుకుంటోందని విమర్శించారు. అందుకే, కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రధాని పేరు, ఫొటో పెట్టకపోతే నిధులు నిలిపివేస్తామని కేంద్రం ప్రకటించిందని పురందేశ్వరి వెల్లడించారు. ఆయా పథకాలను కేంద్రం అమలు చేస్తోందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. అయితే ప్రజల్లో దీనిపై అవగాహన పెరిగిందని తెలిపారు.

  • Loading...

More Telugu News