Ponnada Satish: టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీశ్ బంధువులు ఐదుగురి దుర్మరణం

Mummidivaram MLA Ponnada Satish Relatives Died in Texas Road Accident
  • ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ చిన్నాన్న కుటుంబం మృతి
  • మృతుల్లో ఇద్దరు చిన్నారులు
  • తీవ్ర గాయాలతో బయటపడిన అల్లుడు లోకేశ్
అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వీరు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ బంధువులు. ఎమ్మెల్యే సతీశ్ చిన్నాన్న నాగేశ్వరరావు, ఆయన భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగ, మనవడు, మనవరాలు మృతి చెందారు. నాగేశ్వరరావు అల్లుడు లోకేశ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద వార్త తెలియడంతో అమలాపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Ponnada Satish
Texas Road Accident
Amalapuram
America

More Telugu News