EC: ఏపీలో ఓటర్ల జాబితా విడుదల తేదీని పొడిగించిన కేంద్ర ఎన్నికల సంఘం

EC extends voters list release date
  • తొలుత జనవరి 5న ఓటర్ల తుది జాబితా విడుదల చేయాలనుకున్న ఈసీ
  • తాజాగా జనవరి 22న విడుదల చేయనున్నట్టు ప్రకటన
  • ఏపీ సహా 12 రాష్ట్రాల్లో జాబితా విడుదలకు సన్నాహాలు
ఏపీలో ఓటర్ల ప్రత్యేక తుది జాబితాను జనవరి 5న విడుదల చేయాలని భావించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని మార్చుకుంది. జనవరి 22న ఓటర్ల ప్రత్యేక జాబితా విడుదల చేయనున్నట్టు తాజా ప్రకటనలో పేర్కొంది. ఏపీ సహా 12 రాష్ట్రాల్లో ఓటర్ల ప్రత్యేక జాబితా విడుదలకు సన్నాహాలు చేయాలని ఆయా రాష్ట్రాల సీఈవోలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో, అభ్యంతరాల స్వీకరణ గడువును జనవరి 12 వరకు పొడిగించింది. ఈసీ తాజా నిర్ణయం నేపథ్యంలో, ఓటర్ల జాబితాల్లో సవరణలకు జనవరి 17 వరకు అవకాశం ఉంటుంది.
EC
Voters List
Release Date
AP High Court
India

More Telugu News