మానవ తప్పిదం కారణంగానే కంటకాపల్లి రైలు ప్రమాదం!
- విచారణలో కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ నిర్ధారించినట్టుగా సమాచారం
- బాధ్యులైన రైల్వే అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచన
- ప్రమాదానికి కారణమైన రాయగడ రైలు గంటకు 92 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టు వెల్లడి
మరోవైపు ప్రమాదం జరిగిన రోజు ఉదయం నుంచి సిగ్నల్‌కు సంబంధించిన పనుల కారణంగా రైళ్లు ప్రయాణించే వేగంపై పరిమితిని విధించినట్టు విచారణలో నిర్ధారణ అయ్యింది. ఇక ప్రమాదానికి కారణమైన రాయగడ రైలు గంటకు 92 కిలో మీటర్ల వేగంతో నడిచినట్టు గుర్తించారు. అయితే ఈ రైలు పైలట్, అసిస్టెంట్ పైలట్ ప్రాణాలు కోల్పోవడంతో అంత వేగంగా వెళ్లడానికి కారణాలు తెలియలేదు. ఇదిలావుంచితే కంటకాపల్లి రైలు ప్రమాదంలో 14 మంది చనిపోగా 50 మందికిపైగా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.