Airbus: వికటించిన క్రిస్మస్ పార్టీ... 700 మంది ఎయిర్ బస్ ఉద్యోగులకు అస్వస్థత

700 Employees of Airbus falls ill after attended Christmas party in France
  • ఫ్రాన్స్ లో ఎయిర్ బస్ ఉద్యోగులకు క్రిస్మస్ పార్టీ
  • దాదాపు 2,600 మంది హాజరు
  • వివిధ రకాల వంటకాలతో విందు
  • వాంతులు, విరేచనాలతో బాధపడిన ఉద్యోగులు
క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ఫ్రాన్స్ లో డిసెంబరు 14న ఏర్పాటు చేసిన ఓ విందు కార్యక్రమం వికటించింది. ఇప్పుడు దీనిపై విచారణకు ఆదేశించారు. పశ్చిమ ఫ్రాన్స్ లోని మోంటోయిర్ డి బ్రిటేన్ లో ఎయిర్ బస్ అట్లాంటిక్ ఉద్యోగులకు క్రిస్మస్ పార్టీ ఇచ్చారు. 

కంపెనీ ప్రాంగణంలోనే ఉన్న ఓ రెస్టారెంటులో ఏర్పాటు చేసిన ఈ విందులో దాదాపు 2,600 మంది పాల్గొన్నారు. అనేక రకాల నోరూరించే వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. లాబ్ స్టర్లు, ఆల్చిప్పలు, బీఫ్ తదితర వంటకాలను అతిథులకు వడ్డించారు. 

అయితే, విందు ఆరగించిన వారిలో 700 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. అయితే, ఇలా ఎందుకు జరిగిందన్నది ఇంకా అంతుబట్టకుండా ఉంది. దాంతో, ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. 

ఎయిర్ బస్ అట్లాంటిక్ సంస్థ అధికార ప్రతినిధి ఈ ఘటనపై స్పందిస్తూ, తమ ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిందేమీ లేదని పేర్కొన్నారు. కాగా, పార్టీలో వడ్డించిన ఆహార పదార్థాలను ఎయిర్ బస్ కంపెనీ క్యాంటీన్ లోనే వండినట్టు వర్క్స్ కమిటీ కార్యదర్శి జీన్ క్లాడ్ ఇరిబారెన్ వెల్లడించారు.
Airbus
Christmas Party
Dinner
Ill
France

More Telugu News