Ram Gopal Varma: ఈ విషయాన్ని జనసేన సీరియస్ గా తీసుకోవాలి: వర్మ

RGV tweets on Prashant Kishor issue
  • నిన్న చంద్రబాబును కలిసిన ప్రశాంత్ కిశోర్
  • ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన భేటీ
  • ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ కు భాగం లేదంటూ వర్మ ట్వీట్
  • తండ్రీకొడుకుల నుంచి పవన్ ను కాపాడుకోవాలని పిలుపు

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నిన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం కావడం తెలిసిందే. ప్రశాంత్ కిశోర్ ను నారా లోకేశ్ స్వయంగా హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకువచ్చారు. ఈ అంశం ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. 

అయితే, దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ప్రశాంత్ కిశోర్ తో సమావేశంలో పవన్ కల్యాణ్ ను కూడా భాగం చేయాలన్న విషయాన్ని తండ్రీకొడుకులు ఏమాత్రం పట్టించుకోకపోవడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని వర్మ  జనసేన పార్టీకి సూచించారు. ఆ దుర్మార్గపు ద్వయం వ్యూహం నుంచి పవన్ కల్యాణ్ ను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News