గత ప్రభుత్వ నేతల ఆస్తులపై కూడా శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుండేది!: మంత్రి కొండా సురేఖ
- బీఆర్ఎస్ నేతల ఆస్తులు ఎంత? అని శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుండేదన్న సురేఖ
- దేవాదాయ శాఖ భూముల కబ్జాపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ
- సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడి
వరంగల్ తూర్పు నుంచి ఓటు వేసి తనను గెలిపించిన ప్రజలందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. దేవాదాయ శాఖ భూముల కబ్జాపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై ప్రతిపక్షం వివాదం చేయడం సరికాదన్నారు. అందుకే బీఆర్ఎస్ నేతల ఆస్తులపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాల్సిందని అన్నారు.