Naked Party: రష్యా రాజధానిలో నగ్న పార్టీ.. హాజరైన సెలబ్రిటీలు.. దేశ సంప్రదాయాలను మట్టిలో కలిపేశారంటూ ఆగ్రహావేశాలు

Outrage Over Almost Naked Party In Russia Attended By Many Celebrities
  • మాస్కోలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన పార్టీకి ఆతిథ్యమిచ్చిన నటి
  • హాజరైన అధ్యక్షుడు పుతిన్ ‘గాడ్ డాటర్’ సోబ్‌కచ్ 
  • వారందరినీ బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పిలుపు
  • వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన దాదాపు ‘నగ్న’ పార్టీపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ‘మాస్కో టైమ్స్’ కథనం ప్రకారం ముటాబోర్‌లోని ఓ పాప్యులర్ నైట్ క్లబ్‌లో జరిగిన ఈ పార్టీకి టీవీ ప్రెజెంటర్, నటి అనస్టాసియా ఇవ్లీవా ఆతిథ్యం ఇవ్వడం గమనార్హం. ఈ నగ్నపార్టీకి సంబంధించి వీడియోలు, ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్ సహా దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ దర్శనమిచ్చాయి. 

పాప్ స్టార్లు ఫ్లిప్ కిర్కోరోవ్, లోలిత, డిమా బిలాన్, టీవీ హోస్ట్, 2018 అధ్యక్ష అభ్యర్థి కెసెనియా సోబ్‌చక్ సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సోబ్‌చక్‌ను ‘గాడ్‌ డాటర్’గా పేర్కొంటారు. రష్యా రాజకీయవేత్త మారియా బుటినా కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. 

ఈ పార్టీపై విషయం వెలుగులోకి రాగానే దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ పార్టీ దేశ సంప్రదాయ విలువలను మట్టిలో కలిపేసిందంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో మండిపడ్డారు. దీంతో ఈ నగ్న పార్టీ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఆ పార్టీ రష్యా ఎల్‌జీబీటీక్యూ ప్లస్ ప్రచార నిషేధానికి కట్టుబడే జరిగిందా? సంప్రదాయ రష్యన్ ఆధ్యాత్మిక, నైతిక విలువలను ఉల్లంఘించిందా? అంటూ పార్టీకి హాజరైన బుటినాను రష్యా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. ఈ విషయాన్ని ఆమె ఎక్స్ ద్వారా వెల్లడించింది. 

ఈ పార్టీకి హాజరైనవారిని బాయ్‌కాట్ చెయ్యాలన్న పిలుపు కూడా వైరల్ అయింది. ఆ పార్టీ జరిగిన రెండోరోజున పోలీసులు ఆ నైట్‌క్లబ్‌పై దాడిచేశారు. అయితే, ఆ రోజున గెస్ట్‌లు నిండా దుస్తులు ధరించి కనిపించారు.
Naked Party
Russia
Mascow
Ksenia Sobchak
Vladimir Putin
Mutabor Night Club

More Telugu News