Harirama Jogaiah: మీకు ఓట్లేస్తే చంద్రబాబు సీఎం అవుతారనేదాన్ని జనసైనికులు ఒప్పుకోలేరు: పవన్ కు హరిరామజోగయ్య లేఖ

Harirama Jogaiah letter to Pawan Kalyan
  • చంద్రబాబే సీఎం అని లోకేశ్ చెపుతున్నారన్న జోగయ్య
  • చంద్రబాబు సీఎం కావడానికి మీరు కూడా ఒప్పుకున్నారా అని ప్రశ్న
  • మీరు సీఎం కావాలని కోరుకుంటున్న వారి కలలు ఏం కావాలన్న జోగయ్య
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబే కాబోయే సీఎం అని... ఆయన అనుభవం ఏపీకి కావాలని జనసేనాని పవన్ కూడా చెప్పారు. అందరి మాట ఇదేనని టీడీపీ యువనేత నారా లోకేశ్ కూడా అన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య లేఖ రాశారు. 

లోకేశ్ చెపుతున్నట్టుగా ఐదేళ్ల పాటు చంద్రబాబును సీఎంగా చేసేందుకు మీరు కూడా ఒప్పుకున్నారా? అని లేఖలో పవన్ ను జోగయ్య ప్రశ్నించారు. జనసైనికులంతా మీరే సీఎం కావాలని కోరుకుంటున్నారని... మీరు సీఎం కాకపోతే వారి కలలు ఏం కావాలని ప్రశ్నించారు. మీకు ఓట్లేస్తే చంద్రబాబు సీఎం అవుతారనేదాన్ని జనసైనికులు ఒప్పుకోలేరని అన్నారు. మీరు నీతివంతమైన పాలన అందిస్తారని భావించే ప్రజానీకానికి మీరు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. రెండు కులాల నాయకులు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నారని... బడుగు, బలహీనవర్గాలకు మోక్షం ఎప్పుడని అడిగారు.
Harirama Jogaiah
Pawan Kalyan
Janasena
Chandrababu
Nara Lokesh
Telugudesam

More Telugu News