IT Raids: కాంట్రాక్టర్ కేసీ పుల్లయ్య ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు

IT Raids On KC Pullaiah Houses And Offices In Hyderabad  And Proddutur
  • హైదరాబాద్, ప్రొద్దుటూరులో ఏకకాలంలో దాడులు
  • ప్రొద్దుటూరులో కూరగాయల మార్కెట్ పనులు చేపట్టిన పుల్లయ్య సంస్థ
  • కాంట్రాక్ట్ పనులపై ఆరా
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఓ కాంట్రాక్టర్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్నుశాఖ అధికారులు ఏకకాలంలో దాడులకు దిగారు. పొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీకి చెందిన కేసీ పులయ్య కుమారుడు అనిల్ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు.

పొద్దుటూరులోని కూరగాయల మార్కెట్ పనులను కూడా కేసీ సంస్థే చేపట్టింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని పుల్లయ్య సంస్థతోపాటు పొద్దుటూరులోని ఆయన నివాసంలోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న కాంట్రాక్ట్ పనులపై ఆరా తీస్తున్నారు.
IT Raids
Hyderabad
Proddutur
Kadapa District
KC Pullaiah

More Telugu News