K Kavitha: షర్మిల గారు.. మీ చిర్నవ్వు మాదిరే మీ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి: కవిత

Kavitha shares the joy of YS Sharmila
  • అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న షర్మిల కుమారుడు, కుమార్తె
  • గ్రాడ్యుయేషన్ డేకి హాజరైన షర్మిల, అనిల్, విజయమ్మ
  • కంగ్రాట్స్ అంటూ కవిత ట్వీట్
వైసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి రెడ్డి అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ డేకి షర్మిల, ఆమె భర్త అనిల్, తల్లి విజయమ్మ హాజరయ్యారు. ఈ విషయాన్ని షర్మిల ఎక్స్ వేదికగా తెలిపారు. ఫొటోలను షేర్ చేశారు. తన కొడుకు అప్లయిడ్ ఎకనామిక్స్ అండ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ లో ఎంఎస్ పూర్తి చేశాడని, కూతురు బీబీఏ ఫైనాన్స్ డిగ్రీ సాధించిందని చెప్పారు. వారు సాధించిన దాని గురించి చెప్పడానికి ఆనందంగా ఉందని అన్నారు. 

మరోవైపు షర్మిల సంతోషాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా పంచుకున్నారు. 'రాజా, అంజలికి కంగ్రాట్యులేషన్స్. షర్మిల గారు.. మీ పిల్లలు సాధించిన ఉన్నతిని చూసిన మీ ఆనందం అపారమైనదని ఒక తల్లిగా నేను చెప్పగలను. మీ చిరునవ్వు మాదిరిగా వారి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలి' అని ట్వీట్ చేశారు. 
K Kavitha
BRS
YS Sharmila
YSRTP

More Telugu News