Komatireddy Raj Gopal Reddy: అబద్ధాలను నిజాలు చేయడంలో హరీశ్ రావుకు కేసీఆర్ పోలికలు వచ్చాయి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Harish got his uncles Features of lying says komatireddy rajagopal reddy
  • కేసీఆర్, కేటీఆర్ నిన్ను బాగా వాడుకుంటారని హరీశ్ రావుకు రాజగోపాలరెడ్డి కౌంటర్ 
  • కేసీఆర్ తర్వాత కేటీఆరే అవుతారని వ్యాఖ్య   
  • అసెంబ్లీలో హరీశ్ రావు తన పేరును వ్యక్తిగతంగా తీసుకున్నట్లు చెప్పిన రాజగోపాల్ రెడ్డి
తనకు మంత్రి పదవి విషయం పార్టీ పెద్దలు చూసుకుంటారని, కానీ హరీశ్ రావును మాత్రం కేసీఆర్, కేటీఆర్‌లు బాగా వాడుకుంటారని, ఆయనకు అక్కడ న్యాయం జరగదని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ... హరీశ్ రావుకు గంట సమయం ఇచ్చినా ఆయనకు తృప్తిగా లేదన్నారు. ఎందుకంటే ఆయనకు మేనమామ సాలు వచ్చిందని చురక అంటించారు. మాటలు చెప్పడంలో... అబద్ధాలను నిజాలు చేయడంలో.. హరీశ్ రావుకు కేసీఆర్ పోలికలు వచ్చాయన్నారు. మాట్లాడేందుకు ఆయనకు చాలా సమయం ఇచ్చినప్పటికీ ప్రభుత్వంపై విమర్శలు సరికాదన్నారు. మొన్న హరీశ్ రావు తన పేరును వ్యక్తిగతంగా తీసుకున్నారని గుర్తు చేశారు.

'నువ్వు లేచి మమ్మల్ని అడ్డుకున్నంత మాత్రాన నీకు మంత్రి పదవి రాదుపో' అని హరీశ్ రావు తనను ఉద్దేశించి అన్నారని.. అందుకే తాను ఒకటే చెబుతున్నానని.. హరీశ్ రావు ఎన్ని సంవత్సరాలు కష్టపడినా కేసీఆర్ తర్వాత కేటీఆరే అవుతారు కానీ మీకు మోసం జరుగుతుంది... మీకు వారు ఏం చేయరు... మీకు అన్యాయమే జరుగుతుందన్నారు. తండ్రీ కొడుకులు మిమ్మల్ని వాడుకుంటారు తప్ప మీకు అక్కడ న్యాయం జరగదన్నారు. నాకు మంత్రి పదవి రావాలా? వద్దా? మా ముఖ్యమంత్రి, అధిష్ఠానం నిర్ణయం తీసుకుంతాయని.. కానీ తండ్రీకొడుకులు నిన్ను... వాడుకున్నోనికి వాడుకున్నంత అన్నట్లు.. నిన్ను చాలా వాడుకుంటారని హరీశ్ రావును ఉద్దేశించి అన్నారు.
Komatireddy Raj Gopal Reddy
Harish Rao
Congress
BRS

More Telugu News