Telangana: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు

Telangana complaint against AP Rayalaseema lift irrigation project
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించిందని కృష్ణా నది యాజమాన్య బోర్డుకు (కేఆర్ఎంబీ) తెలంగాణ ప్రభుత్వం బుధవారం లేఖ రాసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్‌కు ఈఎన్సీ మురళీధరన్ ఈ లేఖను రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఈఎన్సీ మురళీధరన్ ఫిర్యాదు చేశారు. ఎన్జీటీ ఉత్తర్వులు ఉల్లంఘించి మరీ పనులు చేస్తున్నారని ఈఎన్సీ తెలిపింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే ఈ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించాలని ఈఎన్సీ విజ్ఞప్తి చేసింది.
Go Back to Shorts
Telangana
Andhra Pradesh
krishna reiver

More Telugu News